గ్రీన్ ఎనర్జీ నమూనాతో ఆకట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం విద్యార్థి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అటామిక్ ఎనర్జీ హెవీ వాటర్ ప్లాంట్ స్కూల్‌లో సీబీఎస్‌ఈ ఇంగ్లీష్ మీడియం 9వ తరగతి చదువుతున్న షేక్ అబ్దుల్ రఖీబ్ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు.
డిప్యూటీ సైంటిఫిక్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న షేక్ అబ్దుల్ రజాక్ మరియు కేంద్ర ప్రభుత్వ టీచర్ హసీబున్నీసా దంపతుల ఏకైక కుమారుడైన రఖీబ్, గ్రీన్ ఎనర్జీ అంశంపై రూపొందించిన నమూనాతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ముంబైలోని BARC – అనుషక్తినగర్ పరిధిలో ఉన్న అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ (AECS-6) లో 6-12-2025 నుంచి 7-12-2025 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా ఇంటర్ అటామిక్ ఎనర్జీ బాల్ వైజ్ఞానిక్ ఎగ్జిబిషన్ లో ఈ ప్రదర్శన జరిగింది.
ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అటామిక్ ఎనర్జీ శాఖకు చెందిన వివిధ యూనిట్ల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. DAE మార్గదర్శక యూనిట్ అయిన హెవీ వాటర్ ప్లాంట్ – మణుగురు (D-20) మరియు 018 ఉత్పత్తి యూనిట్ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో పనిచేస్తున్నాయి.
అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నుంచి 7 మంది విద్యార్థులు, ఎస్కార్ట్ టీచర్ హసీబున్నీసా నేతృత్వంలో ఈ పోటీలకు హాజరయ్యారు. ఇందులో 9వ తరగతి విద్యార్థి Sk. అబ్దుల్ రఖీబ్ ప్రదర్శించిన గ్రీన్ ఎనర్జీ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పాఠశాల ప్రిన్సిపాల్ పీ.కే. సింగ్, అలాగే టెమ్రీస్ కౌన్సలర్స్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, ఐషా సిద్దిఖా విద్యార్థులను అభినందించారు.
రఖీబ్ సాధించిన ఈ విజయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

Post a Comment