సూక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి!
ములుగు | డిసెంబర్ 18: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సూక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
ఘటనా స్థలంలో నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం జరుపుతున్న కాంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి, పరిసర అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Post a Comment