-->

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం పంటపొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం పంటపొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం


కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పరందోలి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు వేగంగా వెళ్తుండగానే అకస్మాత్తుగా బ్రేకులు పనిచేయకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ అప్రమత్తతతో బస్సును ప్రధాన రహదారి నుంచి మళ్లించి పక్కనే ఉన్న పత్తి చేను వైపు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

బస్సు పొలాల్లోకి వెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహిళకు చికిత్స కొనసాగుతోంది.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేక్ ఫెయిల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ చర్యను పలువురు అభినందిస్తున్నారు.

ఈ ఘటనతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సాంకేతిక తనిఖీలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793