గణతంత్ర దినోత్సవం: దేశవ్యాప్తంగా 982 మంది పోలీసులకు కేంద్ర అవార్డులు
హైదరాబాద్, జనవరి 25: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ సేవల్లో విశిష్ట సేవలందించిన 982 మంది అధికారులు, సిబ్బందిని అవార్డులకు ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదివారం అధికారిక జాబితాను విడుదల చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రపతి పోలీస్ అవార్డులకు ఆరుగురు సీబీఐ అధికారులు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 25 మందికి పోలీస్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు.
తెలంగాణ నుంచి
- హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్‌రెడ్డికి తెలంగాణ గ్యాలంటరీ అవార్డు దక్కింది.
- ఎస్ఐ దామోదర్‌రెడ్డికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (PSM) లభించింది.
- అదనపు ఎస్పీ జి.ఎస్. ప్రకాష్‌రావుకు తెలంగాణ నుంచి ప్రెసిడెంట్ మెడల్ వరించింది.
- ఐజీ సుమతికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (MSM) అవార్డు లభించింది.
ఫైర్ విభాగంలో ముగ్గురికి MSM అవార్డులు, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ విభాగంలో ముగ్గురు, కరెక్షనల్ సర్వీస్ విభాగంలో ఇద్దరు అవార్డులకు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి
- ఏఎస్పీ ఆర్.ఎం.కె. తిరుమలాచారికి ప్రెసిడెంట్ మెడల్,
- కరెక్షనల్ సర్వీస్ విభాగంలో ముగ్గురు,
- మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో 15 మంది అధికారులు అవార్డులు అందుకోనున్నారు.
దేశ భద్రత, ప్రజా సేవలో విశేష సేవలందించిన పోలీస్ సిబ్బందికి ఈ అవార్డులు గర్వకారణంగా నిలుస్తున్నాయి.

Post a Comment