మున్సిపల్ ఎన్నికలకు మంత్రులకు బాధ్యతలు కేటాయింపు ఏ జిల్లాకు ఏ మంత్రి ఇన్‌చార్జి?
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఎన్నికల సన్నాహకాలకు కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం నుంచే నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బాధ్యతల కేటాయింపు జరిగింది.
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రుల ఇన్‌చార్జి బాధ్యతలు:
- చేవెళ్ల – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- ఖమ్మం పార్లమెంట్ – మంత్రి కొండా సురేఖ
- మహబూబాబాద్ – మంత్రి పొన్నం ప్రభాకర్
- మహబూబ్‌నగర్ – మంత్రి దామోదర రాజనరసింహ
- జహీరాబాద్ – మంత్రి అజారుద్దీన్
- నాగర్‌కర్నూల్ – మంత్రి వాకిటి శ్రీహరి
- భువనగిరి – మంత్రి సీతక్క
- పెద్దపల్లి – మంత్రి జూపల్లి కృష్ణారావు
- మెదక్ – మంత్రి వివేక్ వెంకటస్వామి
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది.

Post a Comment