యాకుబ్ షా వలీ బాబా దర్గా ఉర్సు ఉత్సవాల్లో ముజీబ్ బాబా మహబూబ్ జానీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జనవరి లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో ఉన్న ప్రముఖ యాకుబ్ షా వలీ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉర్సు వేడుకల్లో బిజిగిరి షరీఫ్ దర్గా ఖాదిమ్ ముజీబ్ బాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అలాగే ముస్లిం మైనార్టీ బీసీ–ఈ 4 జిల్లా అధ్యక్షులు మహబూబ్ జానీ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని బాబా దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.
ఉర్సు ఉత్సవాలకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొనడం ఈ దర్గా విశిష్టతకు నిదర్శనంగా నిలిచింది. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Post a Comment