తిలక్ నగర్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
చుంచుపల్లి, జనవరి 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తిలక్ నగర్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోత్ కేస్లీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జెండా ఆవిష్కరణ అనంతరం సర్పంచ్ బానోత్ కేస్లీ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రజలకు అవగాహన కలిగించాలని, దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులుషాంకువార్ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవం లో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో పాటు దేశభక్తి నినాదాలతో తిలక్ నగర్ ప్రాంతం దేశభక్తి వాతావరణంతో మార్మోగింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామంలో ఐక్యతను, దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించారని గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Post a Comment