తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటింపు
హైదరాబాద్ | జనవరి 06: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఈ నెల జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పండుగ సెలవులు ముగిసిన అనంతరం జనవరి 17వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సెలవులను ఆనందంగా, ఉత్సాహంగా గడపడంతో పాటు భద్రతా జాగ్రత్తలు పాటించాలని విద్యాశాఖ సూచించింది.
అదేవిధంగా పండుగల సమయంలో అనవసర ప్రయాణాలు, ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు.

Post a Comment