-->

మమ్ముట్టికి పద్మభూషణ్… రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ

మమ్ముట్టికి పద్మభూషణ్… రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ


న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 113 మందికి పద్మశ్రీ, 13 మందికి పద్మభూషణ్, 5 మందికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాలను అందుకున్నారు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ గాయని అల్కా యాజ్ఞిక్లకు పద్మభూషణ్ అవార్డు లభించింది.

తెలుగు సినీ పరిశ్రమ నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలాగే తమిళ నటుడు మాధవన్, బెంగాలీ సినీ నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీలకు కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది.

బాలీవుడ్‌కు చెందిన దివంగత నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు లభించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793