-->

🚨 వాహనాలపై అనధికారిక ప్రెస్, అడ్వకేట్, HRC గుర్తులకు చెక్

🚨 వాహనాలపై అనధికారిక ప్రెస్, అడ్వకేట్, HRC గుర్తులకు చెక్


 నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఐ&పీఆర్ శాఖ

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో వాహనాలపై అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్న ప్రెస్, అడ్వకేట్, మానవ హక్కులు (HRC) సంబంధిత పేర్లు, ప్రభుత్వ చిహ్నాలు, లోగోలు, స్టిక్కర్లు, ముద్రలు తదితర గుర్తుల వినియోగాన్ని కఠినంగా అరికట్టాలని సమాచార & ప్రజాసంబంధాల (I&PR) శాఖ ఆదేశాలు జారీ చేసింది.


రవాణా కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరకు, కర్ణాటక హైకోర్టు 04-04-2025న ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మోటారు వాహన నిబంధనలు–1989లోని రూల్ 50, 51లు మరియు మోటారు వాహనాల (డ్రైవింగ్) నిబంధనలు–2017లోని రెగ్యులేషన్ 36ను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై లేదా ఇతర భాగాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అధికారిక హోదా ఉన్నట్టు భావింపజేసే జెండాలు, గుర్తులు, పేర్లు, స్టిక్కర్లు, సీల్స్, లోగోలు వినియోగం పూర్తిగా నిషేధమని అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా,👉 సమాచార & ప్రజాసంబంధాల శాఖ ద్వారా గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు మాత్రమే ‘PRESS’ అనే పదాన్ని వాహనాలపై వినియోగించే అనుమతి ఉంటుంది.

👉 అనుమతి లేని వారు ‘PRESS’ గుర్తు ఉపయోగిస్తే అది నకిలీ అధికార హోదాగా (Impersonation) పరిగణించబడుతుంది.
👉 ఎట్టి పరిస్థితుల్లోనూ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లపై ‘PRESS’ గుర్తును ప్రదర్శించరాదు.

ఈ నేపథ్యంలో జిల్లాల్లో ప్రెస్ గుర్తుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్ని జిల్లా ప్రజాసంబంధాల అధికారులను (DPROలు) ఐ&పీఆర్ శాఖ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793