-->

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన హౌసింగ్ AE అరెస్ట్

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన హౌసింగ్ AE అరెస్ట్


ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్‌ను తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఫిర్యాదుదారుడి ఇంటి ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, అలాగే ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయడానికి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన శ్రీకాంత్, అదే మొత్తాన్ని స్వీకరిస్తుండగా అనిశా అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతినిరోధక శాఖను సంప్రదించాలని ACB అధికారులు సూచించారు.

ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయవచ్చని, అలాగే

  • వాట్సాప్ : 9440446106
  • ఫేస్‌బుక్ : Telangana ACB
  • ఎక్స్ (ట్విట్టర్) : @TelanganaACB
  • వెబ్‌సైట్ : acb.telangana.gov.in

ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793