-->

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సహాయం

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సహాయం


నిజామాబాద్/డిచ్‌పల్లి, ఫిబ్రవరి గతేడాది విధి నిర్వహణలో ఉండగా దుండగుల దాడిలో కత్తిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి ఆర్థిక సహాయం అందింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ప్రమోద్ భార్య శ్రీమతి ప్రణీత గారికి అందజేశారు.

‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా సీఎం గారు ఈ చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ప్రమోద్ త్యాగాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పోలీస్ శాఖలో సేవలందిస్తూ ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తగిన గౌరవం, సహాయం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793