-->

మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం

విధి నిర్వహణలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి


నిజామాబాద్, ఫిబ్రవరి: ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అందజేశారు.

‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా, సీఎం రేవంత్ రెడ్డి గాజుల సౌమ్య తల్లి సహా ఇతర కుటుంబ సభ్యులకు రూ.1 కోటి చెక్కును స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాజుల సౌమ్య త్యాగాన్ని ప్రభుత్వం ఎప్పటికీ మరిచిపోదని, ఆమె కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793