Big Breaking: లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్
కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారీ ఊరట లభించింది. కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న ఆమెపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
Central Bureau of Investigation (సీబీఐ) నమోదు చేసిన కేసులో అక్రమాలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని Rouse Avenue Court Complexలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ మాట్లాడుతూ, ఈ కేసులో కవితతో పాటు నిందితులుగా ఉన్న 23 మంది పై ఆరోపణలను నిర్ధారించే పటిష్టమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. దాంతో అందరికీ ఉపశమనం లభించింది.
రాజకీయంగా కీలక సమయంలో వచ్చిన ఈ తీర్పు కవితకు పెద్ద ఊరటనిచ్చింది. రాబోయే రాజకీయ కార్యక్రమాలు, పార్టీ సన్నాహాల్లో ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
ఇదిలా ఉంటే, ఈ కేసుపై తదుపరి చర్యల గురించి సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Post a Comment