-->

చేగుంటలో లారీ బోల్తా… డ్రైవర్ అక్కడికక్కడే మృతి

చేగుంటలో లారీ బోల్తా… డ్రైవర్ అక్కడికక్కడే మృతి


Chegunta: మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం పొలంపల్లి–మెదక్ రోడ్డులో లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు.

చేగుంట ఏఎస్ఐ బిక్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి చేగుంట మీదుగా చిన్న శంకరంపేటలోని రాధ స్టీల్ కంపెనీకి సరుకు లోడ్‌తో వెళ్తున్న లారీ పొలంపల్లి శివారులో పేపర్ మిల్లు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ మితిలేష్ (35) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీలో ఉన్న క్లీనర్ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793