-->

సిద్దిపేట జిల్లాలో దారుణం.. కాంగ్రెస్ నేత వంగ బాల్‌రెడ్డి హత్య

సిద్దిపేట జిల్లాలో దారుణం.. కాంగ్రెస్ నేత వంగ బాల్‌రెడ్డి హత్య


సిద్దిపేట: జిల్లాలో శుక్రవారం తీవ్ర కలకలం రేగింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు వంగ బాల్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం, రాజక్కపేట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పలు కోణాల్లో దర్యాప్తు

వంగ బాల్‌రెడ్డి హత్యకు పాత కక్షలు కారణమా? లేక భూ వివాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా? అనే అంశాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వ్యక్తిగత విభేదాలు లేదా రాజకీయ విభేదాలు ఉన్నాయా అనే దానిపై కూడా సమాచారం సేకరిస్తున్నారు.

హత్య వార్త బయటకు రావడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793