పెద్దపల్లి జిల్లాలో లంచం కేసు: మంథని సబ్ రిజిస్ట్రార్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన అకస్మిక చర్యలో మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి గాను సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్ రూ.16,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా తీసుకుంటున్న సమయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో దాడి నిర్వహించిన ఏసీబీ అధికారులు, డబ్బు స్వీకరిస్తున్న సమయంలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
అలాగే క్రింది మార్గాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు:
- వాట్సాప్: 9440446106
- ఫేస్‌బుక్: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
- వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Post a Comment