-->

ఖమ్మంలో విజయోత్సవాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక ప్రకటన

ఖమ్మంలో విజయోత్సవాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక ప్రకటన


మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో విజయోత్సవాల నిర్వహణపై పోలీస్ కమిషనర్ Sunil Dutt కీలక ప్రకటన విడుదల చేశారు.

కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. భారత న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్ 163 అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

నిషేధించిన కార్యక్రమాలు:

  • విజయోత్సవ ర్యాలీలు
  • బైక్ ర్యాలీలు, ఇతర ప్రదర్శనలు
  • బాణాసంచా కాల్చడం
  • డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం
  • సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
  • గుంపులుగా తిరగడం

ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి కార్యకర్తలతో పాటు ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల నెపథ్యంలో ఎలాంటి అల్లర్లు సృష్టించినా ఎవ్వరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో గెలుపు–ఓటములు సహజమని, ఆడంబరాలకు దూరంగా ఉండి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793