-->

భార్యను గొడ్డలితో నరికి హతమార్చిన భర్త.. జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన

భార్యను గొడ్డలితో నరికి హతమార్చిన భర్త.. జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన


జగిత్యాల జిల్లా (Jagtial)లో దారుణ హత్య జరిగింది. కట్టుకున్న భార్యను భర్తనే అత్యంత క్రూరంగా హతమార్చిన ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య, సత్తవ్వ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి గురైన మల్లయ్య సత్తవ్వను గొడ్డలితో నరికి హతమార్చాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793