నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో పసిపాప మృతి
జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత స్పందన
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మృతి చెందడం అమానుషమని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండించింది.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ జాగృతి ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, దాడికి కారణమైన నిందితులను కాపాడేందుకు పోలీసులు నామమాత్రపు కేసులు నమోదు చేసి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఘటనలో పసి బిడ్డ మృతికి కారణమైన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 316, 316(3)తో పాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేసింది.
కులవివక్షతో రజక కుటుంబంపై దాడి చేసి పసి బిడ్డ ప్రాణాలు తీసిన నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ Nagarkurnool District Policeను ఫోన్‌లో సంప్రదించి డిమాండ్ చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి.

Post a Comment