బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో దారుణం.. బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాల్ బస్టాండ్‌లో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే ఓ యువతి కిరాతక హత్యకు గురైంది. 21 ఏళ్ల లావణ్య అనే యువతిని దూరపు బంధువైన చేతన్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు.
సమాచారం ప్రకారం, బస్టాండ్‌లో ఉన్న లావణ్యపై చేతన్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు చేతన్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రాథమిక విచారణలో ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. లావణ్య తన ప్రేమను నిరాకరించడంతో అక్కసుతోనే చేతన్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment