-->

మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న విద్యార్థులు

మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న విద్యార్థులు


భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట్ సమీపంలోని మైత్రీవనం నీలగిరి బ్లాక్ భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తులో పనిచేస్తున్న ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీల ద్వారా రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు పొగతో నిండిపోవడంతో లోపలున్న వారిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది.

భవనం కింద వ్యాపార సముదాయాలు ఉండటం, అంతటా భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల అగ్నిమాపక సిబ్బందికి చర్యలు చేపట్టడం క్లిష్టంగా మారింది. ఎవరికైనా ప్రమాదవశాత్తూ కిందపడినా గాయాలు కాకుండా ఉండేందుకు భవనం కింద సేఫ్టీ నెట్ ఏర్పాటు చేశారు. భారీ నిచ్చెనల సాయంతో బాల్కనీల నుంచి విద్యార్థులను కిందికి దింపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతకు గురైంది. స్థానికులు, ఉద్యోగులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో సహకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

(మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.)

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793