-->

BREAKING: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఈసారి కీలక మార్పులు

BREAKING: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఈసారి కీలక మార్పులు


తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. Telangana Board of Intermediate Education (TGBIE) గురువారం అధికారికంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్ టికెట్లను విడుదల చేసింది.

మార్చి 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఈ హాల్ టికెట్లలో ఈసారి కీలక మార్పులు చేశారు. విద్యార్థుల వివరాలను సురక్షితంగా నిల్వ చేసేందుకు, నకిలీ హాల్ టికెట్లకు అడ్డుకట్ట వేయేందుకు క్యూఆర్ కోడ్‌ను అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాల్లో హాల్ టికెట్ స్కానింగ్ ద్వారా విద్యార్థుల వివరాలను సులభంగా ధృవీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులకు సూచనలు:

  • హాల్ టికెట్‌లోని పేరు, ఫోటో, సబ్జెక్ట్ వివరాలు సరిచూసుకోవాలి.
  • తప్పులు ఉంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలి.
  • పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • క్యూఆర్ కోడ్ స్పష్టంగా కనిపించేలా ప్రింట్ తీసుకోవాలి.

పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను బోర్డు ఇప్పటికే ప్రకటించింది. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ పరీక్షలకు సిద్ధమవ్వాలని అధికారులు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793