-->

గచ్చిబౌలి అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. 15 బైక్‌లు దగ్ధం, ఇద్దరు అస్వస్థత

గచ్చిబౌలి అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. 15 బైక్‌లు దగ్ధం, ఇద్దరు అస్వస్థత


హైదరాబాద్, ఏప్రిల్ 20: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

ఈ అగ్నిప్రమాదంలో సెల్లార్‌లో నిలిపిన సుమారు 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పొగ కారణంగా అస్వస్థతకు గురైన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793