-->

ఏప్రిల్ 26న ఎస్.ఐ.ఓ పెద్దపల్లి జిల్లా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం

 

ఏప్రిల్ 26న ఎస్.ఐ.ఓ పెద్దపల్లి జిల్లా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం

స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాన్ఫరెన్స్ ఈ నెల ఏప్రిల్ 26న సాయంత్రం 6:30 గంటలకు మొగల్‌పుర, పెద్దపల్లిలోని ఎం.బి. గార్డెన్ (M.B. Garden) లో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనాబ్ అమీనుల్ హసన్ సాహెబ్, జాతీయ ఉపాధ్యక్షుడు, జమాత్-ఇ-ఇస్లామీ హింద్, న్యూఢిల్లీ హాజరవుతున్నారు. అలాగే బ్రదర్ అబ్దుల్ హఫీజ్, జాతీయ అధ్యక్షుడు, SIO-న్యూఢిల్లీ, బ్రదర్ ఫరాజ్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, SIO ముఖ్యంగా పాల్గొననున్నారు.

విశిష్ట అతిథులుగా ప్రముఖులు హాజరవుతారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, విందు కూడా నిర్వహించబడుతున్నట్లు గోదావరిఖని యూనిట్ అధ్యక్షుడు ఫాజిల్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో SIO పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శులు, గోదావరిఖని యూనిట్ నాయకులతో పాటు ప్రముఖులు జావీద్ హుస్సైనీ (అమీర్ ముకామీ, JIH గోదావరిఖని యూనిట్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సింగరేణి కాలరీస్) మరియు ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ (వైస్ ప్రెసిడెంట్, JIH, రామగుండం మున్సిపల్ కౌన్సిలర్, HMS నేషనల్ సెక్రటరీ) పాల్గొంటారు.

అందరు ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793