ప్రైవేటు ట్రావెల్స్‌కు కళ్లెం… ‘ఒకే దేశం-ఒకే విధానం’ రద్దు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 20: ప్రయాణికుల భద్రతను విస్మరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ‘ఒకే దేశం – ఒకే విధానం’ పేరుతో ఉన్న ఆల్ ఇండియా పర్మిట్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఏ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తాయో, ఆ రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని స్పష్టం చేసింది. అదేవిధంగా, సంబంధిత రాష్ట్రంలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందడం తప్పనిసరి చేసింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పలు రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి జరిగే ఆదాయ నష్టం తగ్గడమే కాకుండా, ప్రైవేటు బస్సుల భద్రతా ప్రమాణాలు మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Post a Comment