ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు కేసీఆర్ పర్యటన.. కీలక సమావేశానికి సన్నాహాలు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ రోజు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ఆయన, జగిత్యాల కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌లో దిగనున్నారు.
అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న కేసీఆర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అనంతరం సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి కేసీఆర్ బయలుదేరనున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉంది.

Post a Comment