-->

మైనారిటీ విద్యార్థులకు టీజీఎంఆర్‌ఈఐఎస్‌లోనే నాణ్యమైన విద్య: న్యాయవాది మొహీద్ పటేల్

మైనారిటీ విద్యార్థులకు టీజీఎంఆర్‌ఈఐఎస్‌లోనే నాణ్యమైన విద్య: న్యాయవాది మొహీద్ పటేల్


నారాయణఖేడ్, ఏప్రిల్ 20: మైనారిటీ విద్యార్థులకు ఉత్తమమైన విద్యా అవకాశాలు తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (టీజీఎంఆర్‌ఈఐఎస్) పాఠశాలలు, కళాశాలల్లో లభిస్తున్నాయని నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ తెలిపారు.

సోమవారం నారాయణఖేడ్‌లోని టీజీఎంఆర్‌ఈఐఎస్ బాలుర శాఖలో ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు మొహీద్ పటేల్‌ను కలిసి టీజీఎంఆర్‌ఈఐఎస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా సమాజ పురోగతికి కూడా కీలకమని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మైనారిటీ విద్యార్థులు 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ కోర్సుల్లో టీజీఎంఆర్‌ఈఐఎస్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత వసతి, ఇతర సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను టీజీఎంఆర్‌ఈఐఎస్‌లో చేర్పించాలని ఆయన కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793