బహుజన్ సమాజ్ పార్టీ పోస్టర్ ఆవిష్కరణ – అంబేద్కర్ జయంతి సభకు ఆహ్వానం
కరీంనగర్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న మహాసభ పోస్టర్‌ను రామడుగు మండల కేంద్రంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కల్లేపల్లి రాజేందర్ నిర్వహించారు.
ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లోని జ్యోతిరావు పూలే సర్కస్ గ్రౌండ్‌లో అంబేద్కర్ జయంతి సభ జరగనుంది. సభకు జోన్-1 ఇంచార్జ్ మాతంగి అశోక్ అధ్యక్షత వహించనుండగా, ముఖ్య అతిథిగా జోన్-1 చీఫ్ జోనల్ ఇంచార్జ్ అడ్వకేట్ నీషానీ రామచంద్రం హాజరుకానున్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆరేపల్లి వినోద్, మహిళా నాయకురాలు బడుగు లక్ష్మి, మాజీ మండల అధ్యక్షులు కడపల శ్రీశైలం, ప్రస్తుత వార్డ్ మెంబర్, మాజీ మండల ఆర్గనైజర్ కల్లేపల్లి ప్రభాకర్, దత్తోజిపేట గ్రామ అధ్యక్షులు బడుగు కిషన్, మెరుగు ప్రశాంత్, రుద్రారం గ్రామ అధ్యక్షులు, అక్కనపల్లి అభి, ఆరేపల్లి ప్రేమ్ సాగర్, బక్కయ్య, రామడుగు టౌన్ అధ్యక్షుడు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కల్లేపల్లి రాజేందర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామం నుంచి కనీసం 100 మంది సభకు తరలించాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాలపై విమర్శలు చేస్తూ, బహుజనుల హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ సిద్ధాంతాలపై నడిచే పార్టీ బీఎస్పీ మాత్రమేనని అన్నారు. అలాగే మాయావతి నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ అంబేద్కర్ జయంతి సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

Post a Comment