-->

తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి


కొత్తగూడెం, ఏప్రిల్ 06: తెలంగాణ జాగృతి సంస్థ నూతన రాజకీయ పార్టీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు డి. వీరన్న పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రజలు నష్టపోయారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలనే లక్ష్యంతో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి నూతన పార్టీగా అవతరించబోతోందని పేర్కొన్నారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం, వారి సమస్యల పరిష్కారం కోసం జాగృతి పార్టీ కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పవన్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ నమ్మి జగదీష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లకావత్ సురేష్, నాయకులు వాంకుడోత్ రవి, కిలారు మాధవి, రాంజీ, సోడియం వెంకట్, నరేష్, వెంకట్ రెడ్డి, విజయ్, ఆదినారాయణ, దుర్గాప్రసాద్, లాలు, రాజమణి రమణ, రామ సీత, లత, లలిత, నరసమ్మ, బుజ్జి, పార్వతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793