వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచి రావాలని భారత ఎంబసీ హెచ్చరిక
భారత రాయబార కార్యాలయం (Tehran Embassy) భారత పౌరులకు అత్యవసర సూచన జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.
ఎంబసీ అధికారుల మార్గదర్శకత్వంలో మాత్రమే సురక్షిత మార్గాలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఎంబసీని సంప్రదించకుండా స్వయంగా సరిహద్దుల వైపు ప్రయాణించవద్దని హెచ్చరించింది.
ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఎంబసీతో సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు మరియు ఈమెయిల్ అందుబాటులో ఉంచింది.
హెల్ప్‌లైన్ నంబర్లు:
989128109115
989128109109
989128109102
989932179359
ఈమెయిల్: cons.tehran@mea.gov.in
భారత పౌరులు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని ఎంబసీ కోరింది.

Post a Comment