బీసీ బంధువు నాగా సీతారాములకు బీపీ మండల్ అవార్డు
భద్రాద్రి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. బీసీ బంధువుగా పేరుగాంచిన ఆయనకు బహుజన అభ్యున్నతికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ “బీపీ మండల్ అవార్డు”ను ప్రదానం చేశారు.
సోమవారం (ఏప్రిల్ 13) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఉన్న సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. బహుజనుల రాజ్యాధికార సాధన సమితి మరియు ఉద్య ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని బడుగుల నాగార్జున యాదవ్, మేకల లలితా యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బీసీల పితామహుడిగా గుర్తింపు పొందిన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జ్ఞాపకార్థంగా ఈ అవార్డును అందజేయడం విశేషం. బీసీ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాగా సీతారాములకు ఈ అవార్డు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
గోకులకృష్ణ ట్రస్ట్ చైర్మన్‌గా, బీసీ బిడ్డలకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో ముందుండే నాగా సీతారాములు, బహుజనుల అభ్యున్నతి, యువతలో చైతన్యం కల్పించడం వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. ఆయనకు లభించిన ఈ గౌరవం జిల్లాకు గర్వకారణమని స్థానికులు, సామాజిక మరియు రాజకీయ వర్గాల వారు అభినందనలు తెలియజేశారు.

Post a Comment