-->

పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం కరీంనగర్ లో విషాదం

పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం కరీంనగర్ లో విషాదం


కరీంనగర్ జిల్లా, ఏప్రిల్ 14: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వైన్ షాపు సమీపంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ పట్టణానికి చెందిన కాసినగొట్టు భారతి అనే మహిళ తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే రామడుగు ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మానవత్వాన్ని చాటుతూ, స్ట్రెచర్‌పై ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లడం గమనార్హం.

ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793