వాసం రామకృష్ణ దోర తెలంగాణ జాగృతిలోకి చేరిక
కొత్తగూడెం, ఏప్రిల్ 17: ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా కొనసాగుతున్న వాసం రామకృష్ణ దోర, జిల్లా అధ్యక్షుడు డి. వీరన్న ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో చేరారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, వాసం రామకృష్ణ దోరకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వాసం రామకృష్ణ దోర జాగృతిలో చేరడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఆయనకు సంస్థలో తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

Post a Comment