పాల్వంచలో విషాదం.. కార్పొరేటర్ కుమారుడు మృతి
పాల్వంచ టౌన్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. 34వ డివిజన్ కార్పొరేటర్ భట్టు విజయలక్ష్మి కుమారుడు అఖిల్ నందన్ (21) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
వివరాల ప్రకారం.. అఖిల్ నందన్ బస్టాండ్ సమీపంలో బుల్లెట్ బైక్‌పై వెళ్తుండగా రోడ్డు దాటే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

Post a Comment