-->

హైడ్రా కూల్చివేతలు.. ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కఠిన చర్యలు

అత్తాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కఠిన చర్యలు


హైదరాబాద్, ఏప్రిల్ 18: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ సర్కిల్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. శనివారం అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు అక్రమంగా నిర్మించిన ఫుట్‌పాత్ ఆక్రమణలను లక్ష్యంగా చేసుకుని GHMC అధికారులు భారీ స్థాయిలో కూల్చివేతలు నిర్వహించారు.

ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆక్రమణదారులు స్పందించకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల భారీ బందోబస్తుతో ఈ చర్యలు చేపట్టారు.

ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఫుట్‌పాత్‌లు ఖాళీగా ఉండటం అత్యవసరమని తెలిపారు.

ఇకపై ఎవరైనా మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించి ఫుట్‌పాత్‌లపై తిరిగి ఆక్రమణలు చేస్తే, కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మాణాలను వెంటనే కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793