-->

చొప్పదండి 13వ వార్డు స్థానికులకు తీరిన త్రాగునీటి కష్టాలు!

చొప్పదండి 13వ వార్డు స్థానికులకు తీరిన త్రాగునీటి కష్టాలు!


చొప్పదండి: మే 09: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీరు సక్రమంగా అందించేందుకు చొప్పదండి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ ముందస్తు చర్యలు చేపట్టారు. చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో శనివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

13వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ మోటర్‌ను ప్రారంభించారు. అలాగే 14వ వార్డులో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన తాగునీరు, రహదారి సౌకర్యాలు అందించేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793