కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు అయినట్లు ప్రచారం
హైదరాబాద్: మే 09: కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం వెలువడింది. ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ బషీర్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
బాలిక ఫిర్యాదు ప్రకారం, నగర పరిసర ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఏప్రిల్ నెలలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నట్లు సమాచారం. తనను బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక ఆరోపించినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వ్యవహారంలో తొలుత కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని, బాలిక తల్లిదండ్రుల ఒత్తిడితో చివరకు ఫిర్యాదు స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, బండి భగీరథ్ కూడా మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఆ బాలిక కుటుంబం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోకపోతే వేధింపుల కేసులు పెడతామని బెదిరించారని, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
భయంతో ఇప్పటికే రూ.50 వేల రూపాయలు ఇచ్చానని, అయినప్పటికీ వేధింపులు ఆగలేదని, రూ.5 కోట్లు ఇవ్వకపోతే బాలిక తల్లి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించినట్లు తెలిసింది.
ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Post a Comment