-->

కామారెడ్డిలో భయానక పేలుడు.. మంటల్లో మూడు కార్లు దగ్ధం!

కామారెడ్డిలో భయానక పేలుడు.. మంటల్లో మూడు కార్లు దగ్ధం!


కామారెడ్డి జిల్లా: మే 09: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శుక్రవారం భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ కారులో ఎల్పీజీ గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ ట్యాంకర్ పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ఘటనతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

పేలుడు ప్రభావంతో అక్కడే పార్కింగ్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఒక బైక్ కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఘటన స్థలంలో దట్టమైన పొగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి పేలుడు కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793