-->

మహిళ దృష్టి మళ్లించి రూ.46 వేల చోరీ.. ముగ్గురు మహిళలు అరెస్ట్

మహిళ దృష్టి మళ్లించి రూ.46 వేల చోరీ.. ముగ్గురు మహిళలు అరెస్ట్

మహబూబాబాద్ టౌన్‌లో మహిళ దృష్టి మళ్లించి బ్యాంకులో నుంచి రూ.46 వేల నగదు అపహరించిన ఘటనలో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని టౌన్ సీఐ రఘుపతి రెడ్డి వెల్లడించారు.

జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్‌లో ఉన్న Indian Bank శాఖలో ఓ మహిళ దృష్టి మళ్లించి నగదు దొంగిలించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసును ఛేదించిన టౌన్ పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇంకా ఒక మహిళ పరారీలో ఉందని, ఆమె కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్సై ఉమా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793