-->

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.. రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.. రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం


తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.. రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం, తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ విజయాన్ని సాధించిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అధికారికంగా అనుమతి ఇచ్చారు. దీంతో టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో రేపు ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు హాజరుకానున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీCK, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీవీకేకు స్వతంత్రంగా 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మంది, సీపీఐ నుంచి 2 మంది, సీపీఎం నుంచి 2 మంది, వీCK నుంచి 2 మంది, ఐయూఎంఎల్ నుంచి 2 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తం బలం 120కు చేరింది. దీంతో అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని టీవీకే కూటమి సులభంగా దాటింది.

ఇక ప్రభుత్వం ఏర్పాటు అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేయాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఇందుకోసం మూడు రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.

సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే అధికారాన్ని దక్కించుకోవడం తమిళనాడు రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీవీకే ప్రభుత్వంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793