-->

అమెరికాలో స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లిన ఎల్బీనగర్‌ యువతి మృతి

అమెరికాలో  స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లిన ఎల్బీనగర్‌ యువతి మృతి


అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లిన ఎల్బీనగర్‌కు చెందిన యువతి ప్రమాదవశాత్తు మృతి చెందింది.

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన దేవేందర్‌రెడ్డి, సునీత దంపతుల కుమార్తె వీణ(28) అమెరికాలోని Virginia రాష్ట్రంలో నివాసం ఉంటోంది. కాగా, ఓ విందు నిమిత్తం రెండు రోజుల క్రితం ఆమె Florida కు వెళ్లింది. అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టేందుకు దూకిన సమయంలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు సమాచారం.

వీణ మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే Devireddy Sudheer Reddy వీణ కుటుంబాన్ని పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వీణ భౌతికకాయాన్ని త్వరలో భారత్‌కు రప్పించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అలాగే మాజీ కార్పొరేటర్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి, తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy తో మాట్లాడి వీణ భౌతికకాయాన్ని నగరానికి తీసుకురావడానికి అవసరమైన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793