-->

హైదరాబాద్‌లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

నడిరోడ్డుపై మహిళ డ్రెస్సును పైకి లేపిన సైకోగాడు దొరికాడు.. పోకిరికి పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్!

హైదరాబాద్ నగరంలోని మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకుని రోడ్డుపై వెళ్తున్న మహిళ వద్దకు వెనుక నుంచి వచ్చిన వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు(26)గా గుర్తించారు. ప్రస్తుతం అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793