రైల్వే స్టేషన్‌లో విషాదం: పట్టాలపై పడుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్: Secunderabad Railway Stationలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడుకొని గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న Telangana Express (ట్రైన్ నం. 12723) ప్లాట్‌ఫారం నం. 1కు చేరుకుంటుండగా, ఓ వ్యక్తి పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. రైలు అతనిపై నుంచి వెళ్లడంతో శరీరం రెండు భాగాలుగా విడిపోయి, ఘటనాస్థలంలోనే మరణించాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. సుమారు 5.6 అడుగుల ఎత్తు కలిగి ఉండగా, కుడి చేతిపై “పల్లవి” అనే టాటూ ఉన్నట్లు గుర్తించారు. ఆకుపచ్చ రంగు చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.

Post a Comment