-->

బాలుడి చేతిలో పేలిన హెచ్‌డబ్ల్యూ బ్యాటరీ – తీవ్ర గాయాలు

మెదక్‌లో విషాదం: బాలుడి చేతిలో పేలిన హెచ్‌డబ్ల్యూ బ్యాటరీ – తీవ్ర గాయాలు


మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట్ మండల కేంద్రంలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఆడుకోవడానికి కొనుగోలు చేసిన బ్యాటరీ ఒక్కసారిగా పేలడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే… శివంపేటకు చెందిన రాజపేట సత్తయ్య కుమారుడు శివతేజ (10) రూ.50కు 9 వాట్స్ హెచ్‌డబ్ల్యూ బ్యాటరీ కొనుగోలు చేశాడు. అనంతరం దానికి చిన్న పరికరం అమర్చి ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా బ్యాటరీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడి చేతి వేళ్లు తీవ్రంగా దెబ్బతిని, రక్తస్రావం జరిగింది.

తక్షణమే కుటుంబ సభ్యులు బాలుడిని కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతోంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రమాదకర వస్తువులు చిన్నారులకు సులభంగా అందుబాటులో ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793