-->

ఉప్పల్ చౌరస్తా తాత్కాలిక మూసివేత.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు

ఉప్పల్ చౌరస్తా తాత్కాలిక మూసివేత.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు


హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా ను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన పిల్లర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్‌ను ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్దకు మార్చారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..

  • హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా – నాచారం – మల్లాపూర్ – ఐవోసీ – చెంగిచర్ల మార్గంలో వరంగల్ హైవే చేరుకోవాలి.
  • చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్క్ నుంచి లిటిల్ ఫ్లవర్ పాఠశాల వెనుక రహదారి ద్వారా వరంగల్ రహదారికి వెళ్లవచ్చు.
  • వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను ఉప్పల్ ఏషియన్ సినీ థియేటర్ ఎదుటి హెచ్‌ఎండీఏ రోడ్డుమార్గంగా నాగోల్ రోడ్డుకు మళ్లిస్తారు.
  • ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 వద్ద నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది.

భారీ వాహనాలకు ప్రత్యేక సూచనలు

  • భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద యూ-టర్న్ తీసుకుని తిరిగి ఉప్పల్ వైపు రావాలి.
  • వరంగల్ వైపు వెళ్లేవారు హెచ్‌ఎండీఏ లేఅవుట్ నుంచి వరంగల్ హైవేకు చేరుకోవాలి.
  • వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ మార్గంలో హయత్‌నగర్ మీదుగా నగరంలోకి ప్రవేశించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793