-->

వరంగల్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లు.. లాయర్‌పై దుండగుల దాడి చైన్ లాక్కేళ్లారు

వరంగల్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లు.. లాయర్‌పై దుండగుల దాడి చైన్ లాక్కేళ్లారు


వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఓ లాయర్ మెడలో నుంచి దుండగులు బంగారు చైన్ లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది.

ఇంటిముందు కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్‌ను ఒక్కసారిగా లాక్కొని పరారయ్యారు. వారిని అడ్డుకునేందుకు లాయర్ ప్రయత్నించగా, స్నాచర్లను వెంబడించే క్రమంలో కిందపడిపోయి గాయాలపాలయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇటీవల నగరంలో చోటుచేసుకున్న మరో రెండు చైన్ స్నాచింగ్ ఘటనలతో ఈ కేసుకు సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఒకే ముఠా ఈ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు దుండగుల కదలికలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793