-->

సూపర్ బజార్ సెంటర్‌లో ఘనంగా హనుమాన్ జయంతి మెగా అన్నదానం

సూపర్ బజార్ సెంటర్‌లో ఘనంగా హనుమాన్ జయంతి మెగా అన్నదానం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ భక్తి శ్రద్ధలతో కళకళలాడింది. రమణ శెట్టి అంజి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా అన్నదాన కార్యక్రమం ఘన విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు చిన్ని, 3టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు, కార్పొరేటర్లు రావి రాంబాబు, సింగార హరిహరన్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డిస్తూ సేవా కార్యక్రమంలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజ సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ మెగా అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు.

కార్యక్రమంలో రమణశెట్టి ఆంజనేయులు, కొపిశెట్టి శ్రీనివాస్ రావు, ఆకుల దుర్గారావు, నమాని కిరణ్, లాలు, వాసుపల్లి నరేందర్, బసనబోయిన వెంకటేశ్వర్లు, సంగెం అరుణ్ కుమార్, ఆచార్య, రమణశెట్టి శరత్, రమణశెట్టి సాయి తేజ, బోండా శ్రీను, అచ్చయ్య, ఆకుల నాని, సాయి, చరణ్, కాల్వ సతీష్, ఇండ్లబండి రమేష్, రాజు, ఇడ్లీ బండి నరేందర్, గణేష్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం సూపర్ బజార్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793