పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలో ఖానావళి హోటల్‌లో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా: మే 10: పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి NH-65 పక్కన ఉన్న ఓ ఖానావళి హోటల్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పేలుడు తీవ్రతకు హోటల్‌లోని సామగ్రి ఎగిరిపడగా, భారీ శబ్దంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Post a Comment