-->

కాలనీలో త్రాగునీటి సమస్యను తీర్చిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

కాలనీలో త్రాగునీటి సమస్యను తీర్చిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్


మంథని, మే 22: మంథని మున్సిపల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల ప్రజలు నీటి సమస్యపై విన్నవించడంతో వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి కలిసి శ్రీపాద కాలనీలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు.

వేసవి తీవ్రత దృష్ట్యా శ్రీపాద కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి ఇబ్బందులను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.

13వ వార్డు శ్రీపాద కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘం నాయకుడు బెజ్జంకి డీగంబర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా బెజ్జంకి డీగంబర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మూల సరోజన, పార్టీ సీనియర్ నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్లు కుర్ర లింగయ్య, పెంటరి రాజు, నూకల కమల్, ఎరుకల స్రవంతి రమేష్, ఎల్లంకి వంశీ, జంబోజు సమ్మయ్య, మారుపాక నిహారిక నాగరాజ, వేముల లక్ష్మీ, శ్రీనివాస్, పాపారావు, గోవిందుల రమేష్, సరిత, సుగుణ, రజిత, రేణుక, నరసమ్మ, స్రవంతి, ఈశ్వరయ్య, సంతోష్, అమర్నాథ్, కనకరాజు, ప్రసాద్, బాలరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793